‘మన్మథుడు 2’ రాక అప్పుడేనా ?

‘మన్మథుడు 2’ రాక అప్పుడేనా ?

Published on Jun 10, 2019 12:00 AM IST

Manmadhudu2

కింగ్ నాగార్జున – రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్ లో సూపర్ హిట్ మూవీ ‘మన్మథుడు’కి సీక్వెల్ గా రూపొందతున్న చిత్రం ‘మన్మథుడు 2’. అయితే ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని నాగార్జున పుట్టిన రోజు నాడు ఆగస్టు 29న ఈ సినిమా విడుదల కానుందని ఇటీవలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ డేటే బెస్ట్ అని చిత్రబృందం కూడా దాదాపు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మరి నాగ్ ఈ డేట్ నే ఖాయం చేస్తాడో.. లేక మరో డేట్ కి షిఫ్ట్ అవుతాడో చూడాలి.

ఇక ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుండగా సమంత, కన్నడ బ్యూటీ అక్షరా గౌడ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా గత కొన్ని రోజుల నుండి ఈ సినిమా షూటింగ్ హైదరాబద్ లో శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రానికి దర్శకుడు రాహుల్ రవీంద్రన్, నిర్మాతలు: నాగార్జున అక్కినేని, పి. కిరణ్, సంగీతం: చైతన్ భరద్వాజ్, సినిమాటోగ్రఫీ: ఎం సుకుమార్, స్క్రీన్ ప్లే: రాహుల్ రవీంద్రన్, సత్యానంద్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు