కరోనా బారినపడిన ప్రముఖ నటుడు

Published on Mar 12, 2021 9:00 pm IST

దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి తగ్గుతోంది అనుకుంటుంటే కరోనా కేసులు మాత్రం బయటపడుతూనే ఉన్నాయి. సెకండ్ వేవ్ మొదలైందనే ఊహాగానాల నడుమ ఈ కొత్త కేసులు భయాన్ని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా చిత్ర రంగం కరోనా పేరు చెబితేనే గుండెలు పెట్టుకుంటోంది. అన్ని భాషలు పరిశ్రమలు మెల్లగా కోలుకుంటున్న నేపథ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం కరోనాకు ప్రభావితం అవుతూనే ఉంది. ఇటీవలే ప్రముఖ హీరో రన్బీర్ కపూర్, స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి ఇద్దరూ కరోనాకు గురై క్వారంటైన్లోకి వెళ్లిపోయారు.

ఇక తాజాగా మరొక స్టార్ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్ సైతం కరోనాకు గురయ్యారు. పరీక్షల్లో పాజిటివ్ అని రావడాంతో ఆయన హోమ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ఆయన తాజాగా నటిస్తున్న ‘డెస్పాచ్’ సినిమా షూటింగ్లోనే ఆయనకు వైరస్ సోకినట్టు చెబుతున్నారు. ఆ చిత్ర దర్శకుడికి సైతం కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ సంగతి తెలియడంతో మనోజ్‌ బాజ్‌పాయ్ త్వరగా కోలుకోవాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. మనోజ్‌ బాజ్‌పాయ్ నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ మంచి ఆదరణ పొందింది. దానికి సీక్వెల్ కూడ రూపొందుతోంది.

సంబంధిత సమాచారం :