10 వసంతాలు పూర్తి చేసుకున్న మంచు మనోజ్

10 వసంతాలు పూర్తి చేసుకున్న మంచు మనోజ్

Published on Aug 6, 2014 8:20 PM IST

Manchu-Manoj

టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న యంగ్ హీరోస్ లో మంచు మనోజ్ ఒకరు. లెజెండ్రీ నటుడు డా. మోహన్ బాబు తనయుడైన మంచు మనోజ్ బాలనటుడిగా తెలుగు చిత్ర సీమకు పరిచయమయ్యాడు. మోహన్ బాబు నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు.

2004లో ‘దొంగ దొంగది’ సినిమాతో మంచు మొజ్ హీరోగా తెలుగు చిత్ర సీమకి పరిచయమయ్యాడు. ఈ సినిమా అనుకున్నంత పెద్ద హిట్ కాకపోయినా మంచు మనోజ్ పెర్ఫార్మన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత మనోజ్ అందరిలా రెగ్యులర్ సినిమాలపై ఆసక్తి చూపకుండా రొటీన్ కి భిన్నంగా ఉండే కాన్సెప్ట్ లని, లాగే సినిమా సినిమాకి డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతని తెచ్చుకున్నాడు.

మనోజ్ కెరీర్లో ‘నేను మీకు తెలుసా’, ‘ప్రయాణం’, ‘వేదం’, ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ లాంటి డిఫరెంట్ సినిమాలను చేస్తూనే ‘బిందాస్’, ‘Mr. నూకయ్య’, ‘పోటుగాడు’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ లాంటి కమర్షియల్ హిట్స్ ని కూడా అందుకున్నారు. ప్రస్తుతం మొజ్ కరెంట్ తీగ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

తాజా వార్తలు