
అందమైన కుటుంబ బంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో చక్కటి సినిమాలు తీసే దర్శకుడిగా దశరథ్‌కి మంచి పేరుంది. తాజాగా ఆయన విభిన్న సినిమాల ద్వారా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్‌తో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే! ఆదివారం ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను ఫిల్మ్‌నగర్‌లోని ప్రొడక్షన్ హౌస్ ఆఫీస్‌లో నిర్వహించి సినిమాను లాంచ్ చేశారు.
ఇక ఈ సినిమాకు రచయితగా పనిచేస్తున్న గోపీమోహన్, మనోజ్-దశరథ్‌ల కాంబినేషన్ పై నమ్మకం వ్యక్తం చేశారు. ఓ సరికొత్త కథతో తెరకెక్కనున్న ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని ఆయన అన్నారు. దశరథ్ కొత్త పంథాలో ఈ సినిమా తెరకెక్కించనున్నారని ఆయన అన్నారు. ‘సూర్య వ్స్ సూర్య’ వంటి విభిన్న కథాంశంతో రూపొందిన సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్ ఎం.శివకుమార్, సురక్ష ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం 2 గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల భామ రెజీనా ఖరారయ్యారు. మంచు మనోజ్‌తో రెజీనా జతకట్టడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ ముఖ పాత్రలో నటించనున్నారు.

