
అందమైన కుటుంబ బంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో చక్కటి సినిమాలు తీసే దర్శకుడిగా దశరథ్‌కి మంచి పేరుంది. తాజాగా ఆయన విభిన్న సినిమాల ద్వారా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్‌తో ఓ సినిమా చేయనున్నారు. కింగ్ నాగార్జునతో చేసిన ‘గ్రీకువీరుడు’ తర్వాత దశరథ్ కొత్త చిత్రమేదీ మొదలుపెట్టలేదు. ఈ సమయంలో ఒక మంచి స్క్రిప్ట్ కోసం గత రెండేళ్ళుగా కష్టపడుతున్నారట.
తాజాగా ఈ స్క్రిప్ట్‌ను మంచు మనోజ్‌కి వినిపించగా ఆయన చాలా ఎగ్జైటై వెంటనే ఓకే చేసేశారని సమాచారం. ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మనోజ్ వివాహం వచ్చే నెల 20న జరగనున్న విషయం తెలిసిందే. మనోజ్ వివాహం తర్వాత దశరథ్ సినిమా పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం మనోజ్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అటాక్’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.

