అంచనాలు పెంచుతున్న చిన్న సినిమా ట్రైలర్ !

Published on Aug 12, 2018 7:13 pm IST


ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వంలో గౌతమ్‌ హీరోగా షార్ట్‌ ఫిలిమ్స్‌ ద్వారా ఫేమస్‌ అయిన చాందిని చౌదరి హీరోయిన్‌ గా రాబోతున్న చిత్రం ‘మను’. కాగా ఈ రోజు సాయంత్రం ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల అయింది. ట్రైలర్‌ చిత్రం పై ఆసక్తిని పెంచుతూ ఉంది.. ఓ విభిన్నమైన కథతో ఫణీంద్ర నర్శెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంతో హీరోగా నటిస్తున్న గౌతమ్‌ ఈ చిత్రం పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌, లవ్‌ ఎంటర్‌టైనర్‌ గా రాబోతున్న ‘మను’ చిత్రం సెప్టెంబర్‌ 7న నిర్వాణ సినిమాస్‌ బాగస్వామ్యంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్రైలర్ కోసం క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

X
More