తన పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ !

Published on Aug 18, 2019 12:58 pm IST

గత కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్ పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక క‌థ‌నాలు వస్తూనే ఉన్నాయి. కాగా తాజాగా ప్రభాస్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు ? అని ప్రభాస్ ను మీడియా ప్రశ్నించింది. దానికి ప్రభాస్‌ సమాధానం చెబుతూ.. ‘పెళ్లి జరగాల్సిన సమయంలో జరుగుతుంది. అది ప్రేమ వివాహం కూడా కావొచ్చు’ అని తెలిపారు. అలాగే ‘సాహో’ కోసం మీరు రూ.100 కోట్లు పారితోషికంగా తీసుకున్నారట అని మీడియా ప్రశ్నించగా.. ‘ఈ సినిమా నిర్మాత నా ఫ్రెండ్. కేవలం ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసమే రూ.80 కోట్లు ఖర్చు చేశాం. ఇక నా పారితోషికం’ విషయానికి వస్తే.. ఈ సినిమాలోని ఓ భాగం బడ్జెట్‌.. నా పారితోషికం’ అని ప్రభాస్‌ చెప్పుకొచ్చాడు.

కాగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన్న ఈ సినిమాను అగ‌ష్టు 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రస్తుతం చిత్రబృందం పెద్ద ఎత్తున ప్రమోషన్స్‌ ను నిర్వహిస్తోంది. టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియ‌స్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ యువి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి, ప్ర‌మెద్, విక్ర‌మ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :