టాలీవుడ్ నటుడు సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ పొలిటికల్ సెటైరికల్ మూవీ మార్టిన్ లూథర్ కింగ్. ఈ చిత్రానికి పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అక్టోబర్ 27, 2023న సినిమా థియేటర్లలో విడుదలైన ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ఆడియెన్స్ ను అలరించడానికి రెడీ అయిపోయింది.
నవంబర్ 29, 2023 నుండి సోనీ LIVలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో వెంకటేష్ మహా, నరేష్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రల్లో నటించారు. YNOT స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ మరియు వెంకటేష్ మహా యొక్క మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్ లపై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.