నాగ చైతన్య, అను ఇమ్మానుయేల్ జంటగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర్రం శైలజా రెడ్డి అల్లుడు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగాషూటింగ్ జరుపుకుంటుంది . రమ్య కృష్ణ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు .
సుమారు 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తి చేసుకోకుండానే డిజిటల్ రైట్స్ రూపంలో భారీ మొత్తాన్ని ఖాతాలో వేసుకుందని వార్తలు వస్తున్నాయి . ఈ సినిమాకు భారీగా ఆఫర్ చేయడానికి కారణం లేకపోలేదు మారుతీ సినిమాలు టీవీ లలో మంచి రేటింగ్స్ సాధిస్తున్నాయి . పైగా వరుస విజయాలతో ఈ దర్శకుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. అందుకే ఈ చిత్రానికి భారీ మొత్తంలో ఆఫర్ చేసారని సమాచారం . మరి ఈ వార్తల్లో నిజం ఉందొ లేదో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చుడాల్సిందే . గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది .


