యాక్షన్ హీరో గోపీచంద్ కి ఓ క్రేజీ ఆఫర్ తగిలినట్లు పరిశ్రమలో వార్తలు మొదలయ్యాయి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతీ ఆయనతో ఓ మూవీ చేస్తున్నారట. దీనిపై వీరిద్దరి మధ్య ఒప్పందాలు కూడా జరిగాయని సమాచారం అందుతుంది. ప్రతిరోజూ పండగే చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న మారుతీ మంచి ఫార్మ్ లో ఉన్నారు. ఆయన హీరో అల్లు అర్జున్ తో మూవీ చేయాలనీ చాల ప్రయత్నం చేశారు. ఐతే అప్పటికే కమిటైన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న బన్నీ మారుతీని వెయిటింగ్ లో పెట్టాడు.
దీనితో మారుతీ హీరో గోపి చంద్ తో మూవీ చేయనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. ప్రస్తుతం గోపీచంద్, సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ అనే మూవీ చేస్తున్నారు. అలాగే దర్శకుడు తేజాతో ఓ మూవీ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. మరి మారుతీ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.


