మహేష్, పవన్‌ల కోసం మారుతి స్క్రిప్ట్ రెడీ!

maruthi
‘భలే భలే మగాడివోయ్’.. నాని హీరోగా, చిన్న సినిమాలతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు మారుతి రూపొందించిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అన్నిచోట్లా మంచి కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా అమెరికాలో మిడిల్ బడ్జెట్ సినిమాల్లో ‘భలే భలే మగాడివోయ్’ ట్రెండ్ సృష్టించింది. ఇక ఈ సినిమాతో నాని స్టార్‌డమ్ అమాంతంగా పెరిగిపోవడంతో పాటు, దర్శకుడు మారుతి రేంజ్ కూడా పెరిగింది.

ఒక కాన్సెప్ట్‌ను అన్నిరకాల ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా, క్లీన్ కామెడీతో తెరకెక్కించిన విధానానికి మారుతిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక భలే భలే మగాడివోయ్ సినిమాతో మారుతి టాప్ లీగ్ దర్శకుల్లో ఒకరుగా చేరిపోయారు. ఇక ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న మారుతి, ‘ఈ రోజుల్లో’ సినిమాతో మొదలైన తన ప్రయాణం ఈ స్థాయికి చేరుకుంటుందని ఎప్పుడూ ఊహించలేదని దర్శకుడు తెలిపారు. ఇక తనకు స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ఎప్పట్నుంచో ఉందని, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్‌ల కోసం తనవద్ద స్క్రిప్ట్స్ కూడా సిద్ధంగా ఉన్నాయని మారుతి ఈ సందర్భంగా తెలిపారు. వారిని డైరెక్ట్ చేసే అవకాశమే వస్తే అంతకంటే సంతోషం ఇంకొకటి ఉండదని మారుతి తెలిపారు.

Exit mobile version