ఆ వార్తలు అవాస్తవం – మారుతి

Published on Apr 8, 2020 9:01 pm IST

దర్శకుడు మారుతి తరువాత సినిమా పై ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. ముఖ్యంగా ఓ నిర్మాత తనయుడితో మారుతి సినిమా చేయబోతున్నట్లు, శర్వానంద్ తో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు ఇలా చాల రూమర్సే వచ్చాయి. అలాగే ‘భలే భలే మగాడివోయ్’తో నేచురల్ స్టార్ నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను ఇచ్చాడు మారుతి. ఇప్పుడు మారుతి, నానితో కలిసి మరొక సినిమా చేయటానికి ప్లాన్ చేస్తున్నాడని కూడా సోషల్ మీడియాలో వినిపించింది. ఐతే తాజాగా మారుతి ఈ రూమర్స్ అన్నిటి పై క్లారిటీ ఇచ్చారు.

మారుతి ట్వీట్ చేస్తూ.. ‘నా తదుపరి సినిమా పై మీడియాలో కొన్ని రూమర్స్ చూశాను, నా సినిమా పై ఆసక్తికి ధన్యవాదాలు. కానీ నేను ప్రస్తుతం స్క్రిప్ట్ వ్రాస్తున్నాను. స్క్రిప్ట్ పూర్తి చేయడానికి ఇంకా సమయం పడుతుంది, నేను స్క్రిప్ట్ పూర్తి చేసిన తర్వాత ఆ సినిమా గురించి మీకు తెలిసిపోతుంది. ప్రస్తుతం వస్తోన్న వార్తలు అయితే పూర్తిగా అవాస్తవం’ అని మారుతి పోస్ట్ చేశారు.

ఇక మారుతి దర్శకత్వంలో సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా వచ్చిన ‘ప్రతిరోజూ పండగే’ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

X
More