సూపర్ స్టార్ ను కలిసిన లేడీ బాక్సర్ !

సూపర్ స్టార్ ను కలిసిన లేడీ బాక్సర్ !

Published on Nov 3, 2018 12:56 AM IST

rajini

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న 2.ఓ చిత్రం కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 11న ఈ చిత్రం విడుదల అవుతున్న విషయం తెలిసిందే. గ్రాఫిక్స్ కి అత్యంత విలువ ఇస్తూ, అద్భుతమైన విజువల్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్స్ ను మొదలు పెట్టింది.

అయితే, ఇండియన్ లేడీ బాక్సర్, ఒలంపిక్ మెడలిస్ట్ మేరీ కోమ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ను కలిశారు. ఈ సందర్భంగా మేరీ కోమ్ రజినీకాంత్ తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ మేరీ కోమ్ రజినీకాంత్ ను ఎందుకు కలిసారో ఇంకా స్పష్టత లేదు. అయితే ఆమె మర్యాదపూర్వకంగానే కలిశారని తెలుస్తోంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు