ఇప్పుడున్న ట్రెండ్ కు తగ్గట్టుగా మాస్ మహారాజ్ రవితేజ ఒక కాన్సెప్ట్ తో వచ్చినప్పటికీ సరైన హిట్ పడకపోవడంతో తనకు ఎంతో పేరు తెచ్చిన మాస్ తోనే మళ్ళీ అలరించేందుకు రెడీ అవుతున్నారు. అలా తన కెరీర్ డౌన్ లో ఉన్న సమయంలోనే దర్శకుడు గోపీచంద్ మలినేనితో తీసిన “బలుపు” చిత్రంతో సిసలైన మాస్ కం బ్యాక్ హిట్ ను మాస్ మహారాజ్ అందుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే దర్శకునితో తీస్తున్న పవర్ ఫుల్ కాప్ డ్రామా “క్రాక్”.
ఈ చిత్రంతో ఎలా అయినా సరే సాలిడ్ హిట్ కొట్టాలని రవితేజ మరియు దర్శకుడు కూడా గట్టిగా ఫిక్స్ అయ్యినట్టున్నారు. అందుకే ఈ చిత్రంపై సూపర్ కాన్ఫిడెన్స్ తో ఎలాంటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేది లేదని ఖరారు చేసేసారు. అలాగే లేటెస్ట్ గా విడుదల చేసిన మాస్ పోస్టర్ కు అయితే సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దీనితో ఈ చిత్రంపై రవితేజ అభిమానులు సహా ఇతర హీరోల అభిమానులు కూడా మరింత అంచనాలు ఏర్పరచుకున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన శృతి హాసన్ మరోసారి నటించనుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.
