మాస్ మహారాజ్..నో కాంప్రమైజ్..?

Published on Apr 15, 2021 1:00 pm IST

మన టాలీవుడ్ వారు వీరు అని లేకుండా అందరి హీరోల అభిమానులు ఇష్టపడే ఏకైక హీరో మాస్ మహారాజ్ రవితేజ. తమ హీరోలకి ఒక సాలిడ్ కం బ్యాక్ వస్తే ఎంత ఆనందం పడతారో రవితేజ కు కూడా మంచి కం బ్యాక్ వచ్చినా అంతే సంతోషం వ్యక్తం చేస్తారు. అలాంటి అభిమానాన్ని మాస్ మహారాజ్ రవితేజ తెచుకున్నాడు. మరి ఇదిలా ఉండగా తాను నటించిన లేటెస్ట్ చిత్రం “క్రాక్” తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసిన రవితేజ…

నెక్స్ట్ దర్శకుడు రమేష్ వర్మతో “ఖిలాడి” అనే మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో రెడీ అవుతున్నాడు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతున్న నేపథ్యంలో పలు సినిమాలు వెనక్కి తగ్గాయి కానీ మాస్ మహారాజ్ మాత్రం నో కాంప్రమైజ్ అన్నట్టుగానే తెలుస్తుంది. ఎప్పుడో మే నెలకు సినిమాను ఫిక్స్ చేసేసిన మేకర్స్ ఇంకా ఆ డేట్ కే స్టిక్ అయ్యి ఉన్నట్టు తెలుస్తుంది. మరి మాస్ మహారాజ్ ఖిలాడి వచ్చే మే 28నే వస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :