మాస్ మహారాజ్ స్పీడ్ మామూలుగా లేదుగా!

Published on Oct 25, 2020 12:23 pm IST

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా ఇపుడు నటిస్తున్న పక్కా మాస్ మసాలా ఎంటెర్టైనర్ “క్రాక్” తో ఎప్పటికప్పుడు అదిరిపోయే అప్డేట్స్ ను చిత్ర యూనిట్ ఇస్తున్నారు. రవితేజ హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్న హ్యాట్రిక్ ప్రాజెక్టు కావడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ చిత్రం లైన్ లో ఉండగానే రవితేజ మరిన్ని ఆసక్తికర ప్రాజెక్టులను లైన్ లో పెట్టేసారు. వాటిలో దర్శకుడు రవివర్మతో ప్లాన్ చేసిన ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ “ఖిలాడి” కూడా ఒకటి. అయితే మాస్ మహారాజ్ నుంచి వచ్చే ఏడాది మొదటి సగంలోనే ఈ రెండు చిత్రాలతో పలకరించడం ఖరారు చేసేసారు.

ఈరోజు దసరా సందర్భంగా క్రాక్ మరియు ఖిలాడి ఈ రెండు చిత్రాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా ప్రకటించేసారు. “క్రాక్” ను సంక్రాంతి రేస్ లో నిలపనుండగా “ఖిలాడి” చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేయనున్నామని కన్ఫర్మ్ చేసేసారు. ఏమాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా అయ్యిన తర్వాత మరొకదానితో మాస్ మహారాజ్ స్పీడ్ మాత్రం మాములుగా లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More