మాస్ మహారాజ్ కాదు.. ఓన్లీ రవితేజ అంటోన్న డైరెక్టర్..!

మాస్ మహారాజ్ కాదు.. ఓన్లీ రవితేజ అంటోన్న డైరెక్టర్..!

Published on Dec 20, 2025 9:06 PM IST

BMW

టాలీవుడ్‌లో మాస్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. ఆయన మ్యానరిజంతో ప్రేక్షకుల్లో ‘మాస్ మహారాజ్’గా ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నాడు. అయితే, ఇప్పుడు ఆయన మాస్ మహారాజ్ కాదని.. కేవలం రవితేజ మాత్రమే అంటున్నాడు ఓ డైరెక్టర్.

దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు కిషోర్ తిరుమల కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా కోసం తనకు మాస్ మహారాజ్ అనే ట్యాగ్ లేకుండా కేవలం రవితేజ పేరునే వాడాలని ఆయన కోరినట్లు దర్శకుడు తెలిపారు. ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండనున్న కారణంతో దర్శకుడు కూడా ఓకే చెప్పారట.

దీంతో ఈ సినిమాలో రవితేజ తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తు్న్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు