బాలీవుడ్‌‍ ఎంట్రీపై రవితేజ కామెంట్స్!

Ravi-teja
మాస్ మహారాజ్ రవితేజ అంటే ఎనర్జిటిక్ యాక్టింగ్‌కి పెట్టింది పేరు. తనదైన మ్యానరిజమ్స్‌తో తెలుగు సినిమాల్లో మంచి స్టార్‌డమ్‌తో దూసుకుపోతోన్న రవితేజ, బాలీవుడ్ ఎంట్రీపై ఓ క్లారిటీ ఇచ్చారు. గత కొద్దికాలంగా రవితేజ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతోన్న నేఫథ్యంలో ఈ విషయమై ఓ ప్రముఖ పత్రిక ఇంటర్వ్యూలో రవితేజ సమాధానమిచ్చారు. తానిప్పుడు పూర్తిగా తెలుగు సినిమాలతో ఖాళీ లేకుండా ఉన్నందున బాలీవుడ్‌లో ఓ ఫీచర్ సినిమా చేసేంత టైమ్ లేదని తెలిపారు.

కాగా బాలీవుడ్‌లో అవకాశం వస్తే మాత్రం చిన్న చిన్న గెస్ట్ రోల్ లాంటివి చేయడానికి సిద్ధమని రవితేజ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇక తాను చిన్నప్పట్నుంచీ అమితాబ్‌కు పెద్ద అభిమానినని తెలిపిన రవితేజ, ఆయనతో కలిసి నటించే అవకాశమే వస్తే వెంటనే చేసేస్తానని తెలిపారు. ప్రస్తుతం బెంగాల్ టైగర్ సినిమాను చివరి దశకు తీసుకొచ్చిన రవితేజ, ఆ తర్వాత బాలీవుడ్ సూపర్ హిట్ ‘స్పెషల్ 26’ రీమేక్‌లో నటించనున్నారని సమాచారం.

Exit mobile version