షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి టూర్ కు వెళ్లనున్న మాస్ రాజా !

Published on Apr 17, 2019 3:00 am IST

మాస్ రాజా రవితేజ కు గత ఏడాది ఏమాత్రం కలిసి రాలేదు. ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకులముందుకు వచ్చిన ఒక్కటి కూడా విజయాన్ని అందించలేకపోయింది. ఇక దాంతో స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. భారీగా మార్పులు చేశాక డిస్కో రాజా స్క్రిప్ట్ ను ఓకే చేశాడు రవితేజ. ఇటీవలే ఈ చిత్రం లాంచ్ అయ్యి మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ ని హోల్డ్ లో పెట్టాడు.

ఇక ఎప్పటినుండో అనుకుంటున్నా తెరి రీమేక్ ను మొత్తానికే పక్కకు పెట్టేసిన రవితేజ మరో రెండుకొత్త ప్రాజెక్టులను ఓకే చేసే పనిలో వున్నాడు . ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం రవితేజ ఫ్యామిలీ తో కలిసి ఫారెన్ టూర్ కు వెళ్లే పనిలో వున్నాడు. మళ్ళీ మే లో ఇండియా కు తిరిగి వచ్చాక తన కొత్త సినిమాల గురించి నిర్ణయం తీసుకోనున్నాడు.

సంబంధిత సమాచారం :