బాలయ్య బర్త్ డే మాస్ ట్రీట్ కి భారీ రెస్పాన్స్.!

Published on Jun 10, 2022 10:05 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా మరో మాస్ దర్శకుడు గోపిచంద్ మలినేని తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బాలయ్య కెరీర్ లో 107వ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఈరోజు బాలయ్య బర్త్ డే సందర్భంగా నిన్న సాయంత్రం మాసివ్ బర్త్ డే ట్రీట్ టీజర్ ని రిలీజ్ చేశారు. మరి ఇది సూపర్ మాస్ ఎలిమెంట్స్ తో అదరగొట్టగా ఇప్పుడు ఇది భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది.

15 గంటల్లో 3.6 మిలియన్ కి పైగా వ్యూస్ రాగా 2.7 లక్షలు కి పైగా లైక్స్ ని అందుకొని మరిన్ని భారీ మార్క్స్ దిశగా దూసుకెళ్తుంది. మొత్తానికి అయితే బాలయ్య బర్త్ డే బ్లాస్ట్ ఈ రకంగా అదరగొడుతుండగా మేకర్స్ ఒక సరికొత్త పోస్టర్ తో బాలయ్యకి బర్త్ డే విషెష్ తెలిపారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :