మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ చిత్రం నుండి ‘మస్సా మస్సా’ వీడియో సాంగ్‌ను విజయవాడ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విడుదల చేశారు. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ ఇన్‌స్పిరేషనల్ ట్రాక్‌ను అనంత శ్రీరామ్ రాయగా విశాల్ మిశ్రా ఆలపించాడు.
ఈ వీడియో సాంగ్‌లో ప్రొఫెషనల్ రెజ్లర్ పాత్ర కోసం రామ్ చరణ్ పడిన కష్టం, ఆయన భారీ ఫిజికల్ మేకోవర్ మరియు మండుటెండలో గంటల తరబడి చేసిన ప్రాక్టీస్ విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆడియో లాగే ఈ వీడియో సాంగ్‌కు కూడా సోషల్ మీడియాలో సాలిడ్ రెస్పాన్స్ లభించడం ఖాయంగా కనిపిస్తోంది.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


