సమంత కాకరపువ్వొత్తులతో విజయ్ దేవరకొండ సంబరాలు !

సమంత కాకరపువ్వొత్తులతో విజయ్ దేవరకొండ సంబరాలు !

Published on Aug 16, 2018 6:00 PM IST

పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. నిన్న విడుదల అయి మంచి పాజిటివ్ టాక్ తో కల్ర్క్షన్స్ పరంగా దూసుకెళ్తుంది. ఈ చిత్రంలో కామెడీ బాగా పేలడంతో, విజయ్ దేవరకొండ రష్మిక కెమిస్ట్రీ బాగా ఆకట్టుకోవడంతో ప్రేక్షకులతో పాటు సెలబ్రేటిస్ కూడా ఈ చిత్రాన్ని బాగా మెచ్చుకుంటున్నారు.

ఈ సందర్భంగా విజయ్‌ తన ఫ్రెండ్స్ మరియు తన చిత్ర బృందంతో కలిసి ఈ సక్సెస్ సంబరాలను చేసుకుంటున్నాడు. కాగా ఈ సంబరాలను తన అభిమానులతో పంచుకుంటూ ‘నాకెంతో ఇష్టమైన ‘సమంత’ కాకరపువ్వొత్తులతో సంబరాలు జరుపుకొంటున్నాం. అని కాకరపువ్వొత్తుల ప్యాకెట్ పై ఉన్న సమంత ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ చూసిన సమంత విజయ్‌ దేవరకొండకి రీట్వీట్‌ చేస్తూ ‘మీ సంబరాల్లో భాగమైనందుకు నాకెంతో సంతోషంగా ఉంది’ అని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు