మెగాస్టార్ సైరా కోసం యూరప్ లో భారీ ప్రణాళికలు !

Published on Jul 30, 2018 4:09 pm IST

సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘సైరా’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలె హైదరాబాద్ లో జరిగిన షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు. కాగా తర్వాత షెడ్యూల్ ను అబ్రాడ్ లో షూట్ చెయ్యటానికి చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర కెమెరా మెన్ తో కలిసి దర్శకుడు సురేంద్ర రెడ్డి లొకేషన్స్ కోసం ఈ వారం యూరోప్ కు వెళ్లనున్నారు.

అక్కడ 30 రోజుల పాటు చిత్రీకరణకు అనువుగా ఉండే గ్రీన్ లాండ్ కు సంబంధించిన ప్రాంతాలను ఎంపిక చేయనున్నారు. ఐతే అక్కడ చిత్రీకరించే హెవీ డ్యూటీ ఫైట్ సీక్వెన్స్ లు కోసం మంచి సంఖ్యలో జూనియర్ ఆర్టిస్ట్ లు పాల్గొనుబోతున్నారు. ఇందుకోసం హైదరాబాద్ లో వారికి ప్రత్యేకంగా రెండు వారాల పాటు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా.. చిరంజీవి, ఇతర నటులు కూడా ఆ యాక్షన్ డిపార్టుమెంట్ తో కలుస్తారట.

స్వాతంత్ర సమయంలో జరిగే ఈ పోరాట సన్నివేశాలను హాలీవుడ్ ఫేమ్ లీ విట్టేకర్ కంపోజ్ చెయ్యటానికి అంగీకరించడం విశేషం. నయనతార, తమన్నా కథానాయకులుగా నటిస్తోన్న ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :