ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి హాలీవుడ్ స్థాయిలోకి రిలీజ్ కి రాబోతున్న చిత్రాల్లో బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న భారీ విజువల్ ట్రీట్ చిత్రం ‘రామాయణ’ కూడా ఒకటి. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరామునిగా, సాయి పల్లవి సీతాదేవి పాత్రలో దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కించిన ఈ హిస్టారికల్ సినిమా ట్రైలర్ కోసమే అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ ట్రైలర్ ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్న వారికి ఆల్రెడీ రేపు జూలై 24 ఉదయం 10 గంటలకి సమయం లాక్ చేశారు. కానీ లేటెస్ట్ గా ఇందులో చిన్న మార్పు వచ్చినట్టు తెలుస్తుంది. మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ఫీస్ట్ ని ముందే తీసుకొస్తున్నారట. ఉదయం 8 గంటలకే ఆన్లైన్ లో రామాయణ ట్రైలర్ రానుంది అన్నట్టు ఇపుడు వినిపిస్తుంది.
సో దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి హన్స్ జిమ్మర్, ఏ ఆర్ రెహమాన్ లు సంగీతం అందిస్తుండగా నమిత్ మల్హోత్రా నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమా రానున్న దీపావళి కానుకగా భారీ ఎత్తున విడుదల కాబోతుంది.


