అన్ని సినిమాల్లా ముందే “మాస్టర్” స్ట్రీమింగ్.?

Published on Jan 28, 2021 2:00 pm IST

ఇళయ థలపతి విజయ్ హీరోగా మాళవికా మోహనన్ హీరోయిన్ హా లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “మాస్టర్”. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటించిన ఈ చిత్రం ఇటీవలే సంక్రాంతి కానుకగా విడుదల కాబడి భారీ వసూళ్లను అందుకుంది. అయితే అప్పటి నుంచి కేవలం 16 రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేస్తుండడం అనేక భిన్నాభిప్రాయాలను తెస్తుంది.

అయినప్పటికీ అది ఫిక్స్ అయ్యిపోయింది. ఈ జనవరి 29 న అధికారికంగా స్ట్రీమింగ్ కు తీసుకువస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే మరో టాక్ ప్రకారం ఈ చిత్రాన్ని కూడా ప్రైమ్ వీడియో వారు ఇంతకు ముందు రిలీజ్ చేసిన డిజిటల్ ప్రీమియర్స్ లానే కాస్త ముందే స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్టు తెలుస్తుంది.

అంటే ఈ 28 రాత్రి 10 గంటలకు లేదా 10 గంటల 30 నిమిషాలకే వదలనున్నారు.డిజిటల్ ప్రీమియర్ కోసం కూడా చాలా మందే ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా కూడా అలా వస్తుందా లేదా అన్నది చూడాలి. ఇప్పటికే అనిరుద్ ఇచ్చిన ఒక్కో సాంగ్ ను మేకర్స్ వదులుతూ వస్తున్నారు.

సంబంధిత సమాచారం :