థియేటర్లలో బొమ్మ పడేది అప్పుడేనా?

Published on Jun 30, 2021 4:03 am IST


కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూతపడ్డ సినిమా థియేటర్లు మళ్లీ ఎప్పుడు తెరుచుకుంటాయి? బిగ్ స్క్రీన్‌పై బొమ్మ ఎప్పుడు పడుతుంది? అనే దానిపై మాత్రం ఇంకా ఎటువంటి క్లారిటీ రావడం లేదు. తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ లాక్‌డౌన్ పూర్తిస్థాయిలో ముగిసినప్పటికి థియేటర్లను తెరిచే విషయంలో థియేటర్ ఓనర్స్ అసోషియేషన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

అయితే తెలంగాణలో థియేటర్లు తెరుచుకునేందుకు పర్మీషన్ ఉన్నా, ఏపీలో మాత్రం ఇంకా థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకున్నాకే తమ తమ సినిమాల రిలీజ్ తేదీలను ప్రకటించాలని షూటింగ్స్ పూర్తి చేసుకున్న సినిమాల మేకర్స్ వేచి చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పరిస్థితులు కాస్త చక్కబడి రెండు తెలుగు రాష్ట్రాల్లో జూలై మధ్యలో థియేటర్లు తెరుచుకున్నా, జూలై చివరి వారమో లేక ఆగష్ట్‌లోనో సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :