టాక్..ధనుష్ – సౌందర్య విడాకులకు కారణం ఇదేనా.?

Published on Jan 19, 2022 7:32 pm IST

రీసెంట్ గానే మన సౌత్ ఇండియన్ సినిమాకి చెందిన స్టార్ హీరో అయినటువంటి ధనుష్ మరియు తన భార్య సౌందర్య రజినీకాంత్ లు తమ వైవాహిక బంధం నుంచి అధికారికంగా ప్రకటించి షాక్ ఇచ్చారు. దీనితో ధనుష్ అభిమానులు ఈ విషయంపై చాలా బాధ పడ్డారు. ఇక అయ్యింది ఏదో అయ్యిపోయింది వారు ఎవరి జీవితాలు వారు ఇప్పుడు సెపరేట్ గా కొనసాగిస్తున్నారు.

అయితే ఈ విడాకులు అనౌన్స్ చేసిన తర్వాత అసలు 18 ఏళ్ల తర్వాత ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనేదే కాస్త బాధాకరంగా మారిన ప్రశ్న. అయితే ఇప్పుడు కోలీవుడ్ మీడియా వర్గాల నుంచి ఓ కారణం లాంటి సమాధానం వినిపిస్తుంది. గత కొన్నాళ్ళతో పోలిస్తే ధనుష్ క్రేజ్ మరింత పెరిగింది పైగా తమిళ్, తెలుగు, హిందీ సహా ఇంగ్లీష్ లో కూడా ఆఫర్స్ తో చాలా బిజీగా ఉన్నాడు.

దీంతో తాను తన కుటుంబం భార్య పిల్లలతో గడిపే సమయమే ఉండట్లేదని దాదాపు ధనుష్ బయటే ఉంటుండడం మూలాన పరిణామాలు విడాకులకు దారి తీశాయని తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో కానీ ఓ బలమైన కారణాల్లో ఇది కూడా ఒకటని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :