రేపే నయనతార ‘మయూరి’ ట్రైలర్

Nayanthara
సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత అందాల భామ నయనతార స్టార్ హీరోల సరసన కమర్షియల్ ప్రాజెక్ట్స్ చేస్తూనే, లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కూడా వరుసగా చేస్తోంది. నయనతార చేసిన చివరి లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘అనామిక’. ఈ సినిమా తర్వాత ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ సినిమా ‘మాయ'(తమిళ్ టైటిల్). ఈ సినిమా తెలుగు వెర్షన్ కు ‘మయూరి’ అనే టైటిల్ పెట్టారు. షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ ని రేపు చెన్నైలో రిలీజ్ చేయనున్నారు. అశ్విన్ శరవణన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో ఆరి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార ద్విపాత్రాభినయం చేస్తుంది. ఇప్పటి వరకు గ్లామరస్ పాత్రల్లో సందడి చేసిన నయనతార ‘మయూరి’గా భయపెట్టడం గ్యారెంటీ అని ఈ చిత్ర టీం అంటోంది. పోటెన్షియల్ స్టూడియోస్ పతాకంపై ప్రభు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూలైలో ఈ సినిమాని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version