బాక్సర్ గా మారబోతున్న మెగా హీరో !

Published on Dec 22, 2018 1:52 pm IST


‘ఫిదా, తొలిప్రేమ’ చిత్రాల రూపంలో వరుస విజయాలను అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం బ్యాకక్ డ్రాప్ లో ‘అంతరిక్షం 9000 కెఎమ్ పిహెచ్’ చిత్రంతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసందే. తెలుగులో మొదటి సారి అంతరిక్ష నేపథ్యంలో సినిమా రావడంతో ఈ సినిమా పై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

కాగా వరుణ్ మరో సినిమాకి కూడా రెడీ అవుతున్నాడు. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ సొంతంగా ప్రొడక్షన్స్ హౌస్ ను స్థాపించారు. ఈ ప్రొడక్షన్లో ఫస్ట్ సినిమాను వరుణ్ తేజ్ తో చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించనున్నాడట.

సంబంధిత సమాచారం :