మెగా 158 : ‘పెద్ది’ రాకతో మరింత ‘పవర్’ఫుల్‌గా మెగా ప్రాజెక్ట్ లాంచ్..!

మెగా 158 : ‘పెద్ది’ రాకతో మరింత ‘పవర్’ఫుల్‌గా మెగా ప్రాజెక్ట్ లాంచ్..!

Published on May 20, 2026 9:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘మెగా 158’ ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. మే 21న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పూజా కార్యక్రమంతో ప్రారంభించనున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు మరింత క్రేజ్ తీసుకొచ్చేందుకు ఇద్దరు చీఫ్ గెస్టులు వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

‘మెగా 158’ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. పెద్ది రాకతో ఈ వేడుక మరింత జోరుగా మారనుందని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇక ఈ పూజా కార్యక్రమానికి మరింత పవర్ అందించేందుకు పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో అతిథిగా రాబోతున్నాడు.

ఈ ఇద్దరు స్టార్స్ మెగా 158 లాంచ్ కోసం వస్తుండటంతో మెగా ఫ్యాన్స్ ఈ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఒకే వేదికపై మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ సందడి చేయనుండటంతో ఈ వేడుక అభిమానులకు కన్నుల పండుగగా మారడం ఖాయం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు