మెగా హీరో కి జోడిగా చెన్నై బ్యూటీ ?

Published on Apr 11, 2019 12:00 pm IST

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇటీవలే తన మొదటి చిత్రం గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ఇక ఈ చిత్రంలో వైష్ణవ్ కు జోడీగా మొదటగా ఎన్నారై గర్ల్ మనీషా రాజ్ ను తీసుకున్నారు. అయితే ఇప్పుడు సినిమా నుండి ఆమె ను తప్పించి ఆ స్థానంలో మరో హీరోయిన్ ను తీసుకుందామనుకుంటుంన్నారు.

అందులో భాగంగా యంగ్ హీరోయిన్ మెగా ఆకాష్ ను సంప్రదిస్తున్నారని సమాచారం. మరి మెగా ఈ కొత్త హీరో తో నటించడానికి ఓకే చెబుతుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించనున్నాడు. సుకుమార్ రైటింగ్స్ ,మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :