కామెడీ ఫిల్మ్ తో రాబోతున్న మెగా బ్యూటీ

Published on Aug 7, 2018 12:07 pm IST

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 చిత్రంలో మరియు పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో రెండు సూపర్ హిట్ ప్రత్యేక పాటల్లో నటించి మెగా బ్యూటీగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కన్నడ హీరోయిన్ రాయ్ లక్ష్మీ. తాజాగా ఇప్పుడు ఆమె ఓ కామెడీ చిత్రంతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రగా రాబోతున్న కామెడీ ఎంటర్టైనర్ ‘వేర్ ఈజ్ ది వెంకట్ లక్ష్మి’ చిత్రం. ఇటీవలే ఆమె ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ సినిమాలో నవీన్ నేని, పూజిత పొన్నాడా, మహాత్ మరియు పంకజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. నూతన దర్శకుడు కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏబిటి క్రియేషన్స్ బ్యానర్ రూపొందిస్తోంది.

సంబంధిత సమాచారం :

X
More