యమ స్పీడుతో దూసుకెళ్తున్న మెగా డాటర్ !
Published on Jun 23, 2018 9:44 am IST


‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్ గా పరిశ్రమలోకి ప్రవేశించిన మెగా డాటర్ కొణిదెల నిహారిక ఆ సినిమా పెద్దగా సక్సెస్ ఇవ్వకపోవడంతో కొద్దిగా గ్యాప్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె స్పీడ్ చూస్తుంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఇప్పటికే సుమంత్ అశ్విన్ తో కలిసి యువీ క్రియేషన్స్ నిర్మాణంలో ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే సినిమాను చేస్తున్న ఆమె ఇంకో రెండు కొత్త చిత్రాలకు సైన్ చేశారు.

వాటిలో ఒకటి నూతన దర్శకురాలు సుజనా డైరెక్ట్ చేయనున్న లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్. ఇందులో శ్రియాతో కలిసి స్క్రీన్ చేసుకోనుంది నిహారిక. అలాగే నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతునున్న డిస్ట్రిబ్యూషన్ సంస్థ నిర్వాణ సినిమాస్ నిర్మిస్తున్న మొదటి చిత్రంలో కూడ నిహారిక కథానాయకిగా నటించనుంది.

ఈ చిత్రాన్ని దర్శకురాలు ప్రణిత బ్రమండపల్లి డైరెక్ట్ చేయనుండగా రాహుల్ విజయ్ కథానాయకుడిగా నటించనున్నాడు. ఇలా ఈ ఏడాది మూడు సినిమాల్లో నటిస్తున్న నిహారిక ఇదే వేగాన్ని కొనసాగిస్తే స్టార్ లీగ్ లోకి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook