మెగా ఫ్యామిలీ హీరోలందరూ ఒక్కచోట చేరితే…!

Published on Jun 23, 2019 5:23 pm IST

మెగా ఫ్యామిలీ గురించిన ఎంత చిన్న న్యూస్ ఐనా అది సెన్సేషనే. మెగా ఫ్యామిలీ స్టార్ హీరోలు అందరు వారి కజిన్స్ తో కలిసి సండే వీకెండ్ ని జరుపుకుంటున్న ఓ ఫొటోస్ కొన్ని కొద్దిసేపటి క్రితంబయటకి వచ్చాయి. ఆ ఫోటో బయటకొచ్చిన కొద్దిసేపటికే సామజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి. రాంచరణ్,వరుణ్ తేజ్,ధరమ్ తేజ్,కళ్యాణ్ దేవ్ లతో పాటు నిహారిక,శ్రీజా లతోపాటు మరి కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఆ ఫొటోలలో ముఖ్యంగా బాగా పెరిగిన గడ్డం,జుట్టుతో వరుణ్ తేజ్ లుక్ ఆసక్తికరంగా ఉంది.

ప్రస్తుతం వరుణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో “వాల్మీకి” మూవీలో నటిస్తున్న సంగతి తెలిసింది. ఆ మూవీ పాత్ర కొరకు వరుణ్ అలా తయారయ్యారని టాక్. ఇక చరణ్ ,ఎన్టీఆర్ తో కలిసి “ఆర్ ఆర్ ఆర్”చేస్తుండగా,ధరమ్ తేజ్ మారుతి దర్శకత్వంలో “భోగి” అనే మూవీలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More