చిరు, పవన్‌లను కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర..!

Published on Aug 27, 2021 8:41 pm IST

తన అభిమాన నటులు మెగస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను కలవాలన్న సంకల్పంతో 12 రోజుల పాటు సైకిల్ తొక్కాడు ఓ అభిమాని. చిరంజీవి పుట్టిన రోజు ఆగష్టు 22వ తేదిన కావడంతో ఆయనకు ఎలాగైనా శుభాకాంక్షలు తెలపాలని అనుకున్న ఎన్. ఈశ్వ‌ర‌య్య అనే మెగా అభిమాని తిరుప‌తి(అలిపిరి) నుంచి సైకిల్ తొక్కుతూ హైదరాబాద్ వచ్చాడు. మెగస్టార్ పుట్టిన రోజు నాడు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియచేశాడు.

అయితే ఎన్. ఈశ్వ‌ర‌య్య అభిమానానికి ఆశ్చర్యం వ్యక్తం చేసిన చిరంజీవి, త‌న‌ను క‌లిసేందుకు 12 రోజుల పాటు సైకిల్ తొక్కేంత శ‌క్తి ఆయనకు ఎలా వ‌చ్చిందో అని, ఇలాంటి సాహసాలు స‌రికాద‌ని అన్నారు. ఈశ్వరయ్యతో ముచ్చటించి ఫోటో దిగిన చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ని కూడా కలవాలని ఉంది అని ఈశ్వరయ్య అడగడంతో ఆ ఏర్పాట్లను కూడా చిరంజీవి చేశాడు. దీంతో ఈశ్వరయ్య పవన్ కళ్యాణ్‌ని కూడా కలిశాడు. ఇద్దరు మెగా హీరోలు కలవడంతో ఈశ్వరయ్య కూడా సంతోషం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :