రామ్‌ చరణ్‌కు వర్కవుట్ అయింది.. మరి వరుణ్ తేజ్‌‌కు

Published on Jun 25, 2019 10:04 pm IST

గతేడాది విడుదలైన ‘రంగస్థలం’ ఏ స్థాయి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఈ సినిమాతో రామ్ చరణ్ పరిపూర్ణమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా చూసిన ప్రేక్షకులు చరణ్ పాత్రకు అంతలా కనెక్ట్ అవడానికి ఆయన మేకోవర్ కూడా ఒక కారణం. గుబురు గడ్డం, కోర మీసాలతో చరణ్ కొత్తగా కనిపించి మెప్పించారు. ఇప్పుడు అదే రీతిలో కనిపిస్తున్నాడు వరుణ్ తేజ్.

హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న కొత్త సినిమా ‘వాల్మీకి’ కోసం ఈ లుక్ ట్రై చేశాడు వరుణ్. నిన్న ఆ లుక్ తాలూకు టీజర్ విడుదలైంది. ఆ లోకల్ డాన్ పాత్రలో వరుణ్ మేకోవర్ చాలా బాగుంది. ఈమధ్య కాలంలో తెలుగు యువ హీరోలు ట్రై చేసిన ఇంటెన్స్ అండ్ రా లుక్ అంటే ఇదే. ప్రేక్షకుల నుండైతే మంచి స్పందనే వచ్చింది. మెగా ఫ్యాన్స్ అయితే ‘రంగస్థలం’ రామ్ చరణ్‌తో వరుణ్ తేజ్‌‌ను పోలుస్తూ ఆ సినిమాలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్టవుతుందని అంటున్నారు. వారి ప్రిడిక్షన్ ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. 14 రీల్స్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమా సెప్టెంబర్ 6వ తేదీన విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More