మెగా ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు.!

Published on Jan 26, 2021 4:02 pm IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ఆచార్య”. అయితే ఈ చిత్రానికి సంబంధించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవలే షూట్ లో పాల్గొన్న చరణ్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసాడు.

మరి ఇదే సమయంలో మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ టీజర్ కోసం గట్టి బజ్ నే వినిపించింది. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేకర్స్ విడుదల చేస్తారని అంతా ఆశించారు. కానీ ఆ టీజర్ కాదు కదా అప్డేట్ కూడా మేకర్స్ వదల్లేదు.

దీనితో ఈ అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ కు ఫైనల్ గా నిరాశ తప్పలేదు. మరి ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి. ఇక ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అలాగే మ్యాట్నీ ఎంటెర్టైన్మెంట్స్ వారు భారీ వ్యయంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :