మెగా అభిమానులకు వరుసగా వేడుకలే.. వేడుకలు

Published on Sep 18, 2019 8:08 pm IST

రాబోయే 15 రోజుల్లో మెగా అభిమానులకు వరుస ట్రీట్స్ ఉండబోతున్నాయి. మొదట ఈరోజు ‘సైరా’ ట్రైలర్ విడుదల వేడుక ఉంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ జరగబోయే ఈ వేడుకకు రామ్ చరణ్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. అలాగే రాష్ట్రం మొత్తం అనేక థియేటర్లలో ఫ్యాన్స్ సంబరాలు జరపనున్నారు. ఇక 20వ తేదీ వరుణ్ తేజ్ కొత్త సినిమా ‘వాల్మీకి’ విడుదల కానుంది.

ఇక 22వ తేదీ ‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్. మిగతా మెగా హీరోలంతా హాజరుకానున్నారు. కాబట్టి అభిమానులకు కన్నుల పండుగనే అనాలి. ఇక అక్టోబర్ 2న ‘సైరా’ సినిమా విడుదల. ఆ రోజు అసలు సిసలు వేడుకలుంటాయు. ఇలా ఈ 15 రోజులు వరుసగా మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే వీలు దొరికింది.

సంబంధిత సమాచారం :

X
More