వేడుకలకు సిద్దమవుతున్న మెగా అభిమానులు

Published on Sep 18, 2019 3:00 am IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్ర ట్రైలర్ రేపు విడుదలకానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక థియేటర్లలో ట్రైలర్ ప్రదర్శితం కానుంది. హైదరాబాద్ సిటీలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు గల సుదర్శన్ 35 ఎం.ఎం, సంధ్య 70 ఎం.ఎం థియేటర్లలో, తిరుపతి సిటీలోని సంధ్య థియేటర్లో, నెల్లూర్ సిటీలోని ఎస్ 2 సినిమాస్, విజయవాడ అప్సర, వైజాగ్ జగదాంబ, శరత్ థియేటర్లలో, గుంటూరులోని క్రిష్ణ మహల్, భీమవరంలో విజయలక్ష్మి, మదనపల్లిలోని రవి థియేటర్, ఎలూరులోని సాయి బాలాజి, అనంతపూర్ వి మెగా, రాజమండ్రిలోని అనుశ్రీ, సూర్య ప్యాలెస్, గీతా అప్సర
థియేటర్ ఇలా అన్ని నగరాల్లోని ప్రధాన థియేటర్లలో ట్రైలర్ రిలీజ్ కానుంది.

దీంతో ఫ్యాన్స్ రాష్ట్రవ్యాప్తంగా అనేక థియేటర్ల వద్ద కేక్ కటింగ్ వంటి కార్యక్రమాల్ని ప్లాన్ చేసి అభిమానులకు స్వాగతం పలుకుతున్నారు. ఈ హడావిడి చూస్తుంటే రేపు సాయంత్రం మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసేలా కనిపిస్తున్నారు. ట్రైలర్ విడుదలకే సంబరాలు ఇలా ఉంటే ఇక అక్టోబర్ 2న సినిమా విడుదలను పెద్ద పండుగలా సెలబ్రేట్ చేస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు.

సంబంధిత సమాచారం :

X