
దసరా కానుకగా ‘కంచె’ అంటూ వచ్చి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మెగా హీరో వరుణ్ తేజ్. సడన్ గా రిలీజ్ డేట్ అనుకోవడం వలన లోఫర్ షూట్ ని పక్కన పెట్టి వచ్చి కంచె ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. అలాగే పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ తర్వాత వరుణ్ తేజ్ లోఫర్ షూటింగ్ ని ఫినిష్ చేసాడు. లోఫర్ షూటింగ్ ని ఫినిష్ చేసిన తర్వాత కాస్త రిలాక్స్ కోసం వరుణ్ తేజ్ ఒక వారం షార్ట్ హాలిడే కోసం వెళ్ళాడు. తన షార్ట్ హాలిడేని పూర్తి చేసుకొని వచ్చిన వరుణ్ తేజ్ మళ్ళీ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు.
అలా ల్యాండ్ అయ్యాడో లేదో హాలిడే మోడ్ నుంచి వర్క్ మోడ్ లోకి షిఫ్ట్ అయ్యాడు. ఈ రోజు ఉదయం నుంచి వరుణ్ తేజ్ లోఫర్ సినిమాలో తన పార్ట్ కి డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టాడు. ఇక నుంచి కంటిన్యూగా డబ్బింగ్ చెప్పి మరో నాలుగు రోజుల్లో తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ వర్క్ ని ఫినిష్ చేస్తాడు. మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఆడియోని డిసెంబర్ 7న రిలీజ్ చేయాలని, అలాగే సినిమాని డిసెంబర్ 18న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దిశా పాట్ని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సి కళ్యాణ్ నిర్మాత.

