బాలయ్య, రవితేజా లకు పోటీగా మెగా హీరో

sai dharam tej1

సంక్రాంతి చిత్రాలు డిసైడైన తరుణంలో బాలయ్య, రవితేజా క్రిస్మస్ పండుగను టార్గెట్ చేశారు. బాలయ్య కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రూలర్, మాస్ మహారాజా వి ఐ ఆనంద్ దర్శకత్వంలో నటిస్తున్న డిస్కో రాజా చిత్రాలు డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు. కాగా ఈ క్రిస్మస్ పోరులో మరో మెగా హీరో జాయిన్ అయ్యారు. సాయి ధరమ్ తేజ్ మారుతీ దర్శకత్వంలో చేస్తున్న ప్రతిరోజు పండుగే చిత్రాన్ని కూడా అదే రోజు విడుదల చేస్తున్నారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం విడుదల తేదీ పోస్టర్ ని విడుదల చేశారు.

దీనితో క్రిస్మస్ పోరు బాలయ్య, రవితేజ మరియు సాయి ధరమ్ తేజ్ లమధ్య రసవత్తరంగా మారనుంది. నిన్న ఫస్ట్ గ్లిమ్ప్స్ పేరుతో విడుదలైన ప్రతిరోజు పండుగే మూవీ ప్రమోషనల్ వీడియో ఆహ్లాదంగా ఉంది. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తుండగా, రాశి ఖన్నా మరో మారు ధరమ్ తేజ్ కి జంటగా నటించింది. ఎస్ ఎస్ థమన్ ఈ మూవీకి సంగీతం అందించారు.

Exit mobile version