లేటెస్ట్ : అధికారికంగా లాంచ్ అయిన మెగా హీరో మూవీ

లేటెస్ట్ : అధికారికంగా లాంచ్ అయిన మెగా హీరో మూవీ

Published on Dec 2, 2022 9:00 PM IST


టాలీవుడ్ లో ప్రస్తుతం యువ హీరోగా ఒక్కో సినిమాతో మంచి క్రేజ్ అందుకుని దూసుకెళ్తున్న సాయి ధరమ్ తేజ్ ఇటీవల రిపబ్లిక్ మూవీ ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి ఆకట్టుకున్నారు. ఇక ప్రస్తుతం సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి సంస్థల పై కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక థ్రిల్లింగ్ మూవీలో ఆయన యాక్ట్ చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా నేడు తన కెరీర్ 16వ సినిమాని కూడా మొదలెట్టారు తేజ్.

యువ దర్శకుడు జయంత్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ మూవీ యొక్క అధికారిక పూజా కార్యక్రమాలు నేడు జరిగాయి. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీ యొక్క లాంచింగ్ ఈవెంట్ కి మెగా డైరెక్టర్ బుచ్చి బాబు సన ప్రత్యేక అతిథిగా విచ్చేసి యూనిట్ కి అభినందనలు తెలిపారు. కాగా త్వరలో ఈ మూవీకి సంబందించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు