‘హ‌నుమాన్’గా క‌నిపించ‌నున్న స్టార్ హీరో..?

‘హ‌నుమాన్’గా క‌నిపించ‌నున్న స్టార్ హీరో..?

Published on Jul 6, 2024 11:01 PM IST

ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన ”హ‌ను-మాన్” మూవీ బాక్సాపీస్ వ‌ద్ద ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో మ‌నం చూశాం. ఈ సినిమాను ఆయ‌న తెర‌కెక్కించిన తీరు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఇక ఈ సినిమాలో హనుమాన్ రాక‌తో ప్రేక్ష‌కులు ఊగిపోయారు. కాగా, ఈ సినిమాకు సీక్వెల్ గా ”జై హ‌నుమాన్” చిత్రం ఉంటుంద‌ని మేకర్స్ గ‌తంలోనే వ్ల‌ల‌డించారు.

అయితే, ఇప్పుడు ఈ ‘జై హ‌నుమాన్’ మూవీలో హ‌నుమంతుడి పాత్ర‌లో ఎవ‌రు క‌నిపిస్తారా అనేది ఆస‌క్తిక‌రంగా మారంది. ఈ సీక్వెల్ పార్ట్ లో ఖ‌చ్చితంగా హ‌నుమంతుడిని చూపెట్టాల్సి ఉంది. ఈ సినిమా కోసం హ‌నుమాన్ పాత్ర‌ను మెగాస్టార్ చిరంజీవిని ఊహించచుకుని డిజైన్ చేసిన‌ట్లుగా గ‌తంలో ప్ర‌శాంత్ వ‌ర్మ తెలిపారు. తాజాగా ఈ పాత్ర‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తే బాగుంటుంద‌ని చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన చైత‌న్య రెడ్డి తెలిపారు.

ఆమె ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నాకైతే ప‌ర్స‌న‌ల్ గా హ‌నుమంత‌డి పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ అయితే బాగుంటుంద‌ని అనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ పాత్ర‌కు ప‌ర్ఫెక్ట్ గా సెట్ అవుతారు.ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు చేసినా అద్భుతంగా ఉంటుంది. కానీ, సినిమాలో హ‌నుమంతిడి పాత్ర‌లో ఎవ‌రు న‌టించాల‌నేది ఆ హ‌నుమంత‌డికే వ‌దిలేశాం. ఆయ‌న‌కు ఎవ‌రు న‌చ్చితే, వారితో ఆ పాత్ర‌ను చేయించుకుంటారు.’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఇక హ‌నుమాన్ ప్రొడ్యూస‌ర్స్ తాజా చిత్రం ‘డార్లింగ్’ ఈ నెల 19న రిలీజ్ కు రెడీ అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు