
ఒక స్టార్ ఫ్యామిలీ నుంచి హీరోలు పరిచయం సర్వ సాధారణం, అలాగే స్టార్స్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్స్ పరిచయం కావడం అనేది బాలీవుడ్ లో చాలా కామన్ గా జరిగే విషయం. కానీ తెలుగులో మాత్రం చాలా చాలా కొత్త అని చెప్పాలి. ఇప్పుడు ఆ ట్రెండ్ ని క్రియేట్ చేయబోతోంది మెగా ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీ నుంచి పరిచయమైన హీరోల తరహాలోనే నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల హీరోయిన్ గా పరిచయం కావడానికి సిద్దమైందని ఇదివరకే తెలియజేశాం. న్యూస్ ఛానల్ TV9 సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ నిర్మాతగా తెరకెక్కించనున్న ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి నిహారిక సైన్ చేసింది.
యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా నటించనున్న ఈ సినిమాకి మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు ఫేం రామరాజు దర్శకత్వం వహించనున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులను చివరి దశకు తీసుకు వచ్చిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని నవంబర్ 16 నుంచి హైదరాబాద్ లో మొదలు పెట్టనున్నారు. షూటింగ్ కి సంబందించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఒకేసారి తెలుగు – తమిళ భాషల్లో ఈ సినిమాని షూట్ చేసే ఆలోచనలో ఉన్నారు. సునీల్ కశ్యప్ ని ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఎంపిక చేసారు.

