
ఒక స్టార్ ఫ్యామిలీ నుంచి హీరోలు పరిచయం అవ్వడం అనేది సర్వ సాధారణం, అలాగే స్టార్స్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్స్ పరిచయం కావడం అనేది బాలీవుడ్ లో చాలా కామన్ గా జరిగే విషయం. కానీ తెలుగులో మాత్రం చాలా చాలా కొత్త అని చెప్పాలి. ఇప్పుడు ఆ ట్రెండ్ ని క్రియేట్ చేయబోతోంది మెగా ఫ్యామిలీ. నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల హీరోయిన్ గా పరిచయం కావడానికి సిద్దమైందని ఇదివరకే తెలియజేశాం. ప్రీ ప్రొడక్షన్ పనులను చివరి దశకు చేరుకున్న ఈ సినిమాని నవంబర్ 16న లాంచ్ చేయనున్నారని ఇది వరకే తెలియజేశాం.
చెప్పినట్టుగానే ఈ సినిమాని ఈ రోజు అధికారికంగా హైదరాబాద్ లోని సాయిబాబా టెంపుల్ లో లాంచ్ చేసారు. ఈ వేడుకకి హీరో నాగ శౌర్య, నిహారిక కొణిదెల, డైరెక్టర్ రామరాజులతో పాటు నాగబాబు మరియు అతని కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఫేమస్ న్యూస్ ఛానల్ TV9 సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ నిర్మాతగా తెరకెక్కించనున్న ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగు – తమిళ భాషల్లో షూట్ చేయనున్నారు. సునీల్ కశ్యప్ ని ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఎంపిక చేసారు.

