మెగాహీరో సాయి ధరమ్ తేజ్ రొటీన్ ఫార్మాట్ కు స్వస్తి చెప్పి చేస్తున్న చిత్రం ‘తేజ్ ఐ లవ్ యు’. కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పారిస్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ షెడ్యూల్లో తేజ్, అనుపమల మీద ఒక పాటను, కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా యొక్క పూర్తి చిత్రీకరణ మే 18 నాటికి పూర్తికానుంది.
ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడ మొదలయ్యాయి. ఈ వేసవి ఆఖరులో చిత్రాన్ని విడుదలచేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. పూర్తిస్థాయి లవ్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్న ఈ సినిమాతో వరుస పరాజయాల నుండి బయటపడాలని తేజ్ భావిస్తున్నాడు.


