స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీలో మెగా హీరో.?

varun-tej
ముకుంద సినిమాతో మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు తెరకు పరిచయం అయిన హీరో వరుణ్ తేజ్ నటించిన రెండవ సినిమా ‘కంచె’ ఇటీవలే రిలీజ్ అయ్యి అందరి నుంచి మంచి ప్రశంశలను అందుకుంటోంది. ఈ సినిమాకి బాక్స్ కలెక్షన్స్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వరుణ్ చేసిన మూడవ సినిమా ‘లోఫర్/మా అమ్మ సీతామహాలక్ష్మీ’ కూడా డిసెంబర్ లో రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. కెరీర్ మొదటి నుంచి ఒకదానితో ఒకటి సంబంధం లేని డిఫరెంట్ కథలని ఎంచుకొని సినిమాలు చేస్తున్న వరుణ్ తేజ్ తన తదుపరి సినిమాకి కూడా ఓ డిఫరెంట్ కథని ఎంచుకున్నాడు.

మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వరుణ్ తేజ్ తన తదుపరి సినిమాని గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో చేయనున్నాడు. గోపీచంద్ మలినేని వరుణ్ తేజ్ కోసం ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ డ్రామా కథని సిద్దం చేసాడట. ఇటీవలే గోపీచంద్ మలినేని చెప్పిన లైన్ బాగా నచ్చడంతో ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీకి వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం గోపీచంద్ మలినేని ఫుల్ స్క్రిప్ట్ ని డెవలప్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాని నల్లమలపు బుజ్జి – ఠాగూర్ మధు కలిసి నిర్మించే పనిలో ఉన్నారట. ఫైనల్ స్క్రిప్ట్ ఓకే అయితే డిసెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

Exit mobile version