“వకీల్ సాబ్” పై మెగా పవర్ రియాక్షన్ కూడా వచ్చింది.!

Published on Apr 10, 2021 4:02 pm IST

చాలా కాలం తర్వాత ఓ స్టార్ హీరో సినిమా విడుదలతో మళ్ళీ తెలుగు సినిమా కళకళలాడుతుంది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. తన కం బ్యాక్ సినిమాగా వచ్చిన ఇది భారీ ఓపెనింగ్ రాబట్టడంతో పాటుగా ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా సాలిడ్ టాక్ ను తెచ్చుకుంది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని మెగా ఫామిలీ నుంచి కూడా ఒక్కొక్కరూ చూస్తూ వచ్చి తమ రియాక్షన్ ను చెప్పకుండా ఉండలేకపోతున్నారు.

ముందుగా మెగా బిగ్ బ్రదర్ మెగాస్టార్ చిరంజీవి తన స్పందనను తెలియజేయగా ఇప్పుడు మెగా తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన స్పందనను తెలియపరిచాడు. కొన్ని పెర్ఫామెన్స్ లు కేవలం సినిమా చూసేంత వరకు మాత్రమే కాకుండా అది పూర్తయ్యాక కూడా అలా ఉంటాయని అలంటి నటనను కళ్యాణ్ బాబాయ్ వకీల్ సాబ్ లో చూపించారని చరణ్ చెప్పాడు.

అలాగే ప్రకాస్ రాజ్ గారు నివేతా, అంజలి మరియు అనన్యలు తమ రోల్స్ ను బ్రిలియెంట్ గా చేసారని అంతే కాకుండా థమన్ సంగీతం పి ఎస్ వినోద్ గారి ఎక్స్ లెంట్ కెమెరా వర్క్ గా ఉన్నాయని తెలిపాడు. మరి ఫైనల్ గా ఇలాంటి సినిమాను ఇచ్చినందుకు దర్శకుడు వేణు శ్రీరామ్ కు అలాగే నిర్మాతలు దిల్ రాజు మరియు శిరీష్ లకు చరణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినట్టుగా ప్రెస్ నోట్ విడుదల చేసారు.

సంబంధిత సమాచారం :