రామ్ చరణ్ తర్వాత సినిమా ఆ స్టార్ డైరెక్టర్ తో అట ?

Published on Aug 13, 2018 11:36 am IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించనున్నారు. అక్టోబర్ నుంచి ఈ చిత్రం కోసం రామ్ చరణ్ తన డేట్లు ను కేటాయించనున్నాడు. ఐతే చరణ్ ఆ తర్వాత చేయబోయే సినిమా గురించి ఓ ఆసక్తి కరమైన విషయం తెలిసింది.

తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం చరణ్ తనతో గతంలో ‘ఎవడు’ చిత్రాన్ని తీసిన దర్శకుడు వంశీ పైడిపల్లితో ఓ చిత్రం చేయబోతున్నాడట. ఆర్ఆర్ఆర్ చిత్రం పూర్తయిన తరువాత వచ్చే ఏడాది ఈ చిత్రం మొదలవ్వవొచ్చని తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

X
More