‘మా ఇంటి బంగారం’కి మెగాస్టార్ బ్లెస్సింగ్స్!

‘మా ఇంటి బంగారం’కి మెగాస్టార్ బ్లెస్సింగ్స్!

Published on Jun 23, 2026 12:11 AM IST

స్టార్ బ్యూటీ సమంత లీడ్ రోల్ లో నటించిన తాజా చిత్రం మా ఇంటి బంగారం లేటెస్ట్ గా విడుదల అయ్యి భారీ సక్సెస్ చూసిన సంగతి తెలిసిందే. సమంత కెరీర్ లో సోలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా థియేటర్లులో అద్భుతమైన రెస్పాన్స్ తో రాణిస్తున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి బ్లెస్సింగ్స్ ఇపుడు తోడయ్యాయి. లేటెస్ట్ గా మా ఇంటి బంగారం టీం అందరినీ మెగాస్టార్ కలిసి వారి అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. హీరోయిన్ సమంత సహా దర్శకురాలు నందిని రెడ్డి, సామ్ భర్త రాజ్ నిడుమోరు లని కలిసి మెగాస్టార్ మరియు తన భార్య సురేఖ వాణిలు పుష్ప గుచ్చాలు ఇచ్చి సత్కరించారు. దీనితో మా ఇంటి బంగారం యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు